Monday, January 20, 2025

షఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్ … ఢిల్లీ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ముంబై: మహిళల ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో విజయం నమోదు చేసింది. శనివారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పదవి వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ షఫాలీ వర్మ, బౌలింగ్‌లో మరిజానె కాప్ రాణించడంతో ఢిల్లీ అలవోక విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగుల మాత్రమే చేసింది. మరిజానె కాప్ 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టింది. శిఖా పాండే మూడు వికెట్లు తీసి తనవంతు సహకారం అందించింది. గుజరాత్ టీమ్‌లో కిమ్ గార్థ్ 32 (నాటౌట్), హర్లీన్ డియోల్ (20), జార్జియా (22) మాత్రమే కాస్త రాణించారు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 7.1 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ షఫాలీ వర్మ విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. గుజరాత్ బౌలర్లను హడలెత్తించిన షఫాలీ 28 బంతుల్లోనే పది ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లతో అజేయంగా 76 పరుగులు చేసింది. మరోవైపు కెప్టెన్ మెగ్ లానింగ్ 3 ఫోర్లతో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో ఢిల్లీ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయం సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది మూడో విజయం కావడం విశేషం. ఐదు వికెట్లతో గుజరాత్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చిన కాప్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News