Wednesday, January 22, 2025

ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా మెగ్ లానింగ్..

- Advertisement -
- Advertisement -

ముంబై: మహిళల తొలి ఐపిఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ ఎంపికైంది. భారత స్టార్ క్రికెటర్ జెమీ మా రోడ్రిగ్స్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదిలావుండగా ఢిల్లీ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్ర మం కూడా ఘనంగా జరిగింది.

కెప్టెన్ లానింగ్‌తో పాటు జెమీమా రోడ్రిగ్స్, ప్రధాన కోచ్ జొనాథన్ బాటి, జెఎస్‌డబ్లూ జయింట్ ఎండి అండ్ సి ఇఓ ఎస్ సుదర్శన్ తదితరులు కార్యక్రమంలో పా ల్గొన్నారు. ఇదిలావుంటే ఇటీవల జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌లో ట్రోఫీ సాధించిన ఆస్ట్రేలియా జట్టుకు మెగ్ లానింగ్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆమె అపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళల ఐపిఎల్‌లో పాల్గొనే ఢిల్లీ కెప్టెన్‌గా లానింగ్‌ను ఎంపిక చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News