Thursday, January 23, 2025

డబ్ల్యూపిఎల్ షెడ్యూల్ విడుదల..

- Advertisement -
- Advertisement -

ముంబై: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపిఎల్) మరో పక్షం రోజుల్లో ప్రారంభం కానుంది. సోమవారం ముంబైలో వేలం ప్రక్రియ ముగియడంతో విమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్‌ను మంగళవారం బిసిసిఐ విడుదల చేసింది. మార్చి 4న ముంబైలో అట్టహాసంగా ప్రారంభం కానున్న మొదటి సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. 23 రోజుల పాటు సాగనున్న మహిళా క్రికెట్ సంగ్రామం ఐదు జట్లు 20 లీగ్ మ్యాచ్‌లు, రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి.

ఇక మార్చి 26న టైటిల్ పోరు నిర్వహిస్తారు. కాగా, డివై పాటిల్ స్టేడియంలో మార్చి 4న జరిగే తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. మార్చి 5న రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా అదే రోజు సాయంత్రం యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య మరో లీగ్ మ్యాచ్ ఉండనుంది. ఈ లీగ్‌లో ఫైనల్ స్టేజ్ గేమ్ యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మార్చి 21న జరుగుతుంది. 24వ తేదీన రెండో ఎలిమినేటర్ పోరు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News