Monday, January 20, 2025

డబ్లూపిఎల్ వేలం పాట బరిలో 165 మంది క్రికెటర్లు!

- Advertisement -
- Advertisement -

ముంబై: వచ్చే ఏడాది జరిగే మహిళా ప్రీమియర్ లీగ్ డబ్లూపిఎల్ రెండో ఎడిషన్ కోసం డిసెంబర్ 9న క్రికెటర్ల్ల వేలం పాట జరుగనుంది. ముంబై నగరం వేదికగా వేలం పాట జరుగుతుంది. వేలం పాటలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా 165 మంది మహిళా క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా భారత్ నుంచి 104 మంది క్రికెటర్లు ఉన్నారు. దీంతో పాటు 61 మంది విదేశీ క్రికెటర్లు కూడా వేలం పాట బరిలో ఉన్నారు.

అంతేగా మరో 15 మంది అసోసియేట్ దేశాల నుంచి క్రికెటర్లు పేర్లను నమోదు చేసుకున్నారు. కాగా, వేలం పాట బరిలో ఉన్న క్రికెటర్లలో 56 మంది మాత్రమే క్యాప్‌డ్ ప్లేయర్లు ఉన్నారు. మిగతా 109 మంది అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లే. వీరు అంతర్జాతీయ క్రికెట్‌ను ఆడలేదు. ఈ వేలం పాటలో ఐదు ఫ్రాంచైజీలు పాల్గొంటాయి. మొత్తం 30 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలోనూ 9 స్లాట్‌లు విదేశీ క్రికెటర్లవే ఉండడం గమనార్హం. ఈ వేలం పాటకు దీంద్రా దాటిన్, కిమ్ గార్త్‌లు ప్రత్యేక ఆకర్షణగా మారారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News