Monday, November 18, 2024

ఛాంపియన్ బెంగళూరు

- Advertisement -
- Advertisement -

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 ఛాంపియన్స్‌గా బెంగళూరు ఉమెన్స్ జట్టు నిలిచింది. బౌలింగ్, బ్యాటింగ్‌లలో సమష్టిగా రాణించిన మంధనా సేన తొలిసారి డబ్లూపిఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఢిల్లీ విమెన్స్ నిర్ణయించిన 113 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలుండగానే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతిమంధనా(31), సోఫియా డివైన్(32), ఎలిస్సా పెర్రీ(35) రిచా ఘోష్(17)లు బ్యాట్ ఝలిపించి జట్టును విజయతీరాలకు చేర్చి ఛాంపియన్లుగా నిలిచారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఆరంభంలో దూకుడు ప్రదర్శించింది.

అయితే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరు.. ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫలితంగా 113 పరుగులకే ఢిల్లీ చాపచుట్టేసింది. ఓపెనర్లు షెఫాలి వర్మ(44), మెగ్ లానింగ్ (23) మినహా మరెవరూ వికెట్ల ముందు నిలబడలేకపోయార. వికెట్ నష్టపోకుండా పవర్ ప్లేలో 61 పరుగులు చేసినా ఢిల్లీకి సోఫీ మోలినక్స్ వరుస వికెట్లు పడగొట్టి కోలుకోలేని దెబ్బతీసింది. 8 ఓవర్ వేసి మోలినక్స్ వరుసగా 3 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించింది. బెంగళూరు బౌలర్ల ధాటికి ఢిల్లీ జట్టులో కేవలం 4 బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరును చేయగలిగారు. ఇక ఆర్‌సిబి జట్టులో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లు పడగొట్టింది. మమ అనిపిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News