Sunday, January 19, 2025

9న డబ్ల్యూపీఎల్‌ వేలం

- Advertisement -
- Advertisement -

ముంబై: వచ్చే ఏడాదిలో జరిగే మహిళల ఐపిఎల్ (డబ్లూపిఎల్) సీజన్ కోసం మినీ వేలం పాటను నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. డిసెంబర్ 9న ముంబైలో మినీ వేలం పాటను నిర్వహిస్తున్నట్టు బిసిసిఐ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ వేలం పాటు ఐదు ఫ్రాంచైజీలు పాల్గొంటాయని వెల్లడించింది. ఈ ఏడాది తొలిసారి మహిళల ఐపిఎల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపిఎల్‌కు ముందు నిర్వహించిన ఈ టోర్నీకి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో బిసిసిఐ రెండో డబ్లూపిఎల్ కోసం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇ

క వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో డబ్లూపిఎల్ టోర్నీ జరిగే అవకాశాలున్నాయి. దీంతో మినీ వేలం పాటను నిర్వహించేందుకు బిసిసిఐ ప్రయత్నాలు షురూ చుసింది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపి వారియర్స్ జట్లు మహిళల ఐపిఎల్‌లో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. కాగా, వచ్చే సీజన్ కోసం ఆయా ఫ్రాంచైజీలు వేలం పాటలో పాల్గొననున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.11.25 కోట్లు, గుజరాత్ వద్ద రూ.7.55 కోట్లు, ముంబై వద్ద రూ.11.4 కోట్లు, బెంగళూరు టీమ్ వద్ద రూ.10.15 కోట్లు, యూపి వద్ద రూ.9.5 కోట్లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News