Sunday, January 19, 2025

నేడు డబ్ల్యూపిఎల్ వేలం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రీమియర్ లీగ్ ప్లేయర్ల వేలంపాట నేడు ముంబయి వేదికగా జరగనుంది. డబ్ల్యూపిఎల్ తొలి ఎడిషన్‌లో మొత్తం 5జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, క్యాపిటల్స్, యూపీ వారియర్స్ జట్లు డబ్ల్యూపిఎల్ బరిలోకి దిగనున్నాయి. మార్చిలోనే డబ్ల్యూపిఎల్ తొలి సీజన్ ప్రారంభించనున్నట్లు బిసిసిఐ ఇప్పటికే ప్రకటించింది. డబ్ల్యూపిఎల్ మహిళా క్రికెట్ అభివృద్ధికి దోహదపడనుందని బోర్డు తెలిపింది. మార్చి ప్రారంభమయ్యే డబ్ల్యూపిఎల్ వచ్చే నెల 26వరకు జరగనుంది. ఈనేపథ్యంలో ప్లేయర్లు కోసం ముంబయిలోని వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వేలంపాట నిర్వహించనున్నారు.

ప్లేయర్‌ల వేలంపాటు నేడు మధ్యాహ్నం ప్రారంభం కానుంది. స్పోర్ట్ 18నెట్‌వర్క్ వేలంపాటప్రసారం చేయనున్నాయి. జియో సినిమా యాప్‌లో కూడా డబ్ల్యూపిఎల్ వేలంపాట ప్రసారం చేయనున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తీశర్మ, షెఫాలీవర్మ, పెర్రీ, ఎక్లెస్టోన్, సోఫీ డివైన్, డియాండ్రా డాటిన్ తదితర దేశ, విదేశ ఈ వేలంపాటలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అంతర్జాతీయ క్రికెటర్‌కు అత్యధిక బేస్ ధర రూ.50లక్షలు, అత్యల్పంగా రూ.30లక్షలు, అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు హయ్యస్ట్ బేస్ ప్రైస్ రూ.20లక్షలు, కనీస ధర నిర్ణయించారు.

ఒక్కో ఫ్రాంచైజీ వేలంపాటలో పాల్గొనుంది. ఒక్కోఫ్రాంచైజీ ప్లేయర్లు కొనుగోలు చేయవచ్చు. వీరిలో ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉండాలి. ఒక్కో జట్టులో కనీసం 15మంది ఉంటుంది. మొత్తం 1525మంది ప్లేయర్లు వేలంపాటకు తమ పేర్లును నమోదు చేసుకోగా తుది జాబితాలో 409మంది ప్లేయర్లుకు చోటు దక్కింది. కాగా గుజరాత్ జెయింట్స్ జట్టుకు అదానీ గ్రూప్, ముంబై ఇండియన్స్ జట్టుకు రిలయన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వారియర్స్‌కు కాప్రీ గ్లోబల్ యాజమానులుగా వ్యవహరించనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News