Thursday, January 23, 2025

నేడు డబ్ల్యూపిఎల్ ఫైనల్..

- Advertisement -
- Advertisement -

ముంబై: మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపిఎల్) ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ముంబై వేదికగా తుది పోరు జరుగనుంది. ఈ పోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. లీగ్ దశలో ఇరు జట్లు అసాధారణ ఆటతో అదరగొట్టాయి. ఫైనల్లో కూడా ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయి. టోర్నీ ఆరంభంలో ముంబై అద్భుతంగా రాణించగా ఢిల్లీ మధ్యలో అనూహ్యంగా పుంజుకున్నాయి.

ఇక లీగ్ దశలో అగ్రస్థానంలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ శుక్రవారం జరిగిన ఎలిమినేటర్స్‌లో యూపి వారియర్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఇక ముంబై, ఢిల్లీ జట్లలో అగ్రశ్రేణి క్రికెటర్లకు కొదవలేదు. ముంబైలో మాథ్యూస్, సివర్, హర్మన్‌ప్రీత్, యస్తికా భాటియా, మెలి కేర్,పూజా వస్త్రకర్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇక కెప్టెన్ మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగ్స్, మరిజానే కాప్, అలైస్ కాప్సె, జొనాసెన్ వంటి స్టార్లతో ఢిల్లీ కూడా బలంగా ఉంది. దీంతో ఫైనల్ సమయం ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News