Monday, January 20, 2025

ఉమెన్ ఐపిఎల్: ఆర్ సిబిపై ముంబై విజయం..

- Advertisement -
- Advertisement -

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ముంబై ఈసారి విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.

ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ స్మృతి మంధాన (24) పరుగులు చేసింది. ఎలిసె పేరి (29), వికెట్ కీపర్ రిచా ఘోష్ (29) పరుగులు సాధించారు. ప్రత్యర్థి జట్టులో అమెలియా కేర్ మూడు, బ్రంట్, వాంగ్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 16.3 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు మాథ్యూస్ (24), యస్తిక భాటియా (30) శుభారంభం అందించారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అమెలియా కేర్ 4 ఫోర్లతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. పూజా వస్త్రకర్ (19) పరుగులతో తనవంతు పాత్ర పోషించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News