Monday, December 23, 2024

ఏడున్నరేళ్లకు దొరికిన విమానశకలాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయ వైమానిక దళం (ఐఎఎఫ్)కు చెందిన ఎఎన్ 32 విమానం శిథిలాలు ఇప్పుడు లభ్యం అయ్యాయి. దాదాపు ఏడున్నర సంవత్సరాల క్రితం 29 మంది వాయుదళ సిబ్బందితో కూడిన ఈ విమానం జాడతెలియకుండా పోయింది. ఇప్పుడు దీని తాలూకు విడిభాగాలను బంగళాఖాతంలో దాదాపు 3 కిలోమీటర్ల లోతున గుర్తించారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

సముద్ర సాంకేతిక పరిజ్ఞాన విషయాల జాతీయ సంస్థ తరలించిన అత్యాధునిక జలాంతర్గామి తరహా వాహనం ఎయువి సేకరించిన ఛాయాచిత్రాలను పరిశీలించగా ఇవి అప్పటి ఎఎన్ 32 ఎయిర్‌క్రాఫ్ట్‌వే అని నిర్థారణ అయిందని అధికారులు తెలిపారు. అంతకు ముందు ఈ విమాన శిథిలం చెన్నై తీరానికి దూరంలో సముద్రంలో పడి ఉండగా గుర్తించారు. ఈ విమానం గల్లంతు నాటి నుంచి ఇప్పటివరకూ ఇందులోని వాయుదళ సిబ్బంది ఏమైందనే జాడ తెలియకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News