Wednesday, January 22, 2025

అమన్ కంచుమోత

- Advertisement -
- Advertisement -

పారిస్: ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. శుక్రవారం రెజ్లింగ్‌లో భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ కాంస్య పతకం సాధించాడు. పురుషుల 57 కిలోల ఫ్రిస్టయిల్ విభాగంలో అమన్ సెహ్రావత్ ఈ పతకం సొంతం చేసుకున్నాడు. కాంస్యం కోసం జరిగిన పోరులో అమన్ 135 తేడాతో డారియన్ (ప్యూర్టోరికా)పై జయభేరి మో గించాడు. ఆరంభంలో అమన్ కాస్త వెనుకబడ్డాడు. తొలి రౌండ్‌లో డారియన్ పైచేయి సాధించాడు.

కానీ ఆ తర్వాత అమన్ అనూహ్యంగా పుంజుకున్నాడు. అద్భుత ఆటతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. తొలి హాఫ్ ముగిసే సమయానికి 63 ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత మరింత మెరుగైన ప్రదర్శనతో అలరించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లక్షం దిశగా సాగాడు. ఇదే క్రమంలో అలవోక విజయం సాధించి పతకం దక్కించుకున్నాడు. అమన్ పతకంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది. ఈ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు ఐదు కాం స్య పతకాలు, ఒక రజతం గెలుచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News