Friday, October 18, 2024

ఆ వార్తల్లో నిజం లేదు, నేను బతికే ఉన్నా

- Advertisement -
- Advertisement -

Wrestler Nisha Dahiya denies news of death

మరణ వార్తలను ఖండించిన యువ రెజ్లర్ నిషా దహియా

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన యువ మహిళా రెజ్లర్ నిషా దహియా దారుణ హత్య వార్త వట్టిదేనని తేలింది. హర్యానా సోనిపట్‌లో ఉన్న సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడమీ వద్ద నిషా దహియాపై కొందరు దుండగులు కాల్పులు జరిపారని, ఇందులో నిషాతో పాటు ఆమె సోదరుడు మృతి చెందాడని జాతీయ మీడియా వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో నిషా తల్లి కూడా తీవ్రంగా గాయపడిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఇది తెలుసుకున్న సోనిపట్ ప్రజలు సుశీల్ కుమార్ అకాడమీని ధ్వంస చేశారని వార్తలు ప్రసారం అయ్యాయి. అయితే ఈ సంఘటన జరిగింది వాస్తవమేనని, అంతేగాక ఇందులో ఓ యువ మహిళా రెజ్లర్, ఆమె సోదరుడు మరణించారని సోనిపట్ పోలీసులు ధ్రువీకరించారు. కానీ ఆమె ఇటీవల యూత్ రెజ్లింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన నిషా దహియా కాదని పోలీసులు స్పష్టం చేశారు. కాల్పుల ఘటనలో మరణించిన రెజ్లర్ పేరు కూడా నిషా కావడంతో తప్పుడు ప్రచారం జరిగిందని పోలీసులు వివరించారు.

ఆ వార్తలు అవాస్తం: నిషా

మరోవైపు బుధవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా స్టార్ రెజ్లర్ నిషా దహియా దీనిపై స్పష్టత ఇచ్చింది. సోనిపట్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మృతి చెందింది తాను కాదని స్పష్టం చేసింది. తాను సురక్షితంగా ఉన్నానని, తన మరణంపై వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొంది. తనపై వచ్చిన తప్పుడు వార్త కథనాలు ఎంతో మనోవేదనకు గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఉన్నానని వివరించింది. ఈ మేరకు నిషా దహియా ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఇదిలావుండగా భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ సయితం నిషా హత్య వార్తలను ఖండించారు. నిషా బతికే ఉందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News