Thursday, January 23, 2025

టీమిండియా క్రికెటర్‌ను ఎత్తిపడేసిన రెజ్లర్ సంగీత ఫోగట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టి20 స్పెషలిస్ట్ బౌలర్‌గా పేరొందని యజ్వేంద్ర చాహల్ ఫామ్ కోల్పోవడంతో తన స్థానాన్ని టీమిండియాలో కోల్పోయాడు. బిసిసిఐలో సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో కూడా అతడి పేరు లేకపోవడంతో లెగ్ స్పిన్నర్ కెరీర్ ముగిసినట్టేనని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పుడు చాహల్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. స్టార్ రెజ్లర్ సంగీత ఫోగట్ అతడిని అమాంతం ఎత్తుకొని భుజాన వేసుకొని గిరగిరా తిప్పింది. చాహల్ బక్క పల్చగా ఉండడంతో ఎత్తుకొని మూడు రౌండ్లు తిప్పింది, తల్లి తనని వదిలేయ్ అని సరదాగా అరవడంతో అతడిని ఆమె కిందకు దించింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్టార్ రెజ్లర్ భజ్‌రంగ్ పూనియా భార్య సంగీత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News