Monday, January 20, 2025

రెజ్లర్ సుశీల్ కుమార్‌కు షాక్.. హత్యా నేరం కేసుపై విచారణ

- Advertisement -
- Advertisement -

Wrestler Sushil Kumar to face murder trial

న్యూఢీల్లీ: రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు షాక్ తగిలింది. 2021లో జరిగిన రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో సుశీల్ కుమార్‌తో పాటు మరో 17 మందిపై ఢిల్లీ కోర్టు హత్యా నేరం కేసును నమోదు చేసింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ కోర్టు సుశీల్ కుమార్‌పై హత్యా నేరాన్ని మోపింది. అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాలు, నేర పూరిత కుట్ర వంటి సెక్షన్లు కింద సుశీల్‌తో పాటు ఇతరులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నిర్దోషిగా బయటపడాలని భావించిన సుశీల్‌కు కోర్టు తీర్పు షాక్‌కు గురిచేసింది. కాగా, గతేడాది మే 4న సుశీల్ కుమార్‌తో పాటు అతని స్నేహితులు అజయ్ కుమార్ తదితరులు రెజ్లర్ సాగర్ ధంకర్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ధంకర్ తర్వాత మరణించాడు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు సుశీల్‌తో పాటు అజయ్ తదితరులను అరెస్టు చేశారు.

Wrestler Sushil Kumar to face murder trial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News