- Advertisement -
న్యూఢిల్లీ : ప్రొఫెషనల్ రెజ్లర్ దలిప్ సింగ్ రాణా అలియాస్ ద గ్రేట్ ఖలీ ఇవాళ బీజేపీలో చేరారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడం ప్రత్యేకత సంతరించుకున్నది. పంజాబ్‌లో ఫిబ్రవరి 20 న అసెంబ్లీ ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని, దేశం కోసం మోడీ చేస్తున్న పనులు ఆయనను ఉత్తమ ప్రధానిగా మారుస్తోందన్నారు. జాతి అభివృద్ధి భాగస్వామ్యం కావడానికి ఆ పార్టీలో చేరినట్టు ఖలి తెలిపారు. బీజేపీ జాతీయ విధానం తనను అకర్షించినట్టు ఖలీ చెప్పారు. 2020 లో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన రైతు సంఘాలకు ఖలీ మద్దతు ఇచ్చారు. రైతులకు అండగా ప్రజలు నిలవాలని కూడా ఆయన కోరారు.
- Advertisement -