Wednesday, January 22, 2025

సాధన చేశాం.. ఫలితం దక్కలేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబరు 19వ తేదీ నుంచి చైనాలో జరగనున్న ఏసియన్ గేమ్స్ భజరంగ్ పునియా, వినేశ్ పోగట్‌లు ట్రయల్స్‌కు వెల్లకుండానే నేరుగా సెలెక్టైన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్నా రు. ఆదివారం రెజ్లర్ విశాల్ కాళీరామన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి క్రీడాకారులు ట్ర యల్స్‌లో పాల్గొన వలసిందే. ఎన్నో ఏళ్లు కష్టపడి సాధన చేసినప్పటికీ నాకు ఏసియన్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం రాలేదు.

భజరంగ్ పునియా ట్రయల్స్‌లో పాల్గొని, ఉత్తమ ప్రదర్శన చేసి ఏసియన్ గేమ్స్‌కు వెళ్లి, పతకం సాధించాలని కీలక వ్యాఖ్యలు చేశాడు. ట్రయల్స్‌లో గెలిచినా ఏసియన్ గేమ్స్‌కు సెలెక్ట్ కాకపోవడం చాలా బాధ గా ఉందన్నాడు. భజరంగ్ పునియాకు స్టాండ్ బైగా విశాల్ ఉన్నాడు. మరోవైపు, రెజ్లర్ దీపక్ పునియా మాట్లాడుతూ.. ‘ఏసియన్ గేమ్స్ వెళ్లడానికి నన్ను ఎంపిక చేశారు. ఏసియన్ గేమ్స్‌లో గెలవడానికి సాధన చేశాను. ఈ ఏడాది రెండు బిగ్ ఈవెంట్లు ఉన్నాయి. మొదటిది ప్రపంచ ఛాంపియన్‌షిప్, రెండోది ఆసియన్ గేమ్స్. వాటిలో నా సత్తా చూపిస్తాను’ అని అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News