Friday, December 20, 2024

బిజెపి బాకా.. కాంగ్రెస్ ఏజెంట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రెజ్లర్ల నిరసనల ఉద్యమంలో ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. ప్రముఖ రెజ్లర్లు సాక్షి మాలిక్, బబిత ఫోగట్‌లు పరస్పరం తిట్టుకున్నారు. మాటల యుద్ధం మొదలైంది. తాము డబ్లుఎఫ్‌ఐ చీఫ్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతూ ఉంటే, న్యాయం కోసం ముందుకు సాగుతూ ఉంటే మాజీ రెజ్లరు , ఇప్పుడు బిజెపి నేత బబిత ప్రభుత్వానికి బాకా కొడుతున్నారని సాక్షిమాలిక్ మండిపడ్డారు. ఈ వాదనకు ప్రతిగా బబిత పంచ్ ఇచ్చారు. రియోగేమ్స్ కాంస్య విజేత సాక్షి కాంగ్రెస్ మరబొమ్మ అయిందని, కాంగ్రెస్ ఆడిస్తున్నట్లు ఆడుతోందని దాడికిదిగారు. రెజ్లర్ల ఉద్యమం వెనుక ఎటువంటి రాజకీయ ఆలోచనలు లేవని మాలిక్, ఆమె భర్త సత్యవర్ట్ కదియన్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌తో దీనికి ఎటువంటి సంబంధం లేదన్నారు. బిజెపికి బబిత తొత్తుగా మాట్లాడటంలో తప్పేమీ లేదని, ఎందుకంటే ఆమె బిజెపి నేత అని సాక్షిమాలిక్ వ్యాఖ్యానించారు. ఈ వాదనను బబిత తిప్పికొట్టారు. ఆమె వ్యాఖ్యలకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదన్నారు. తనకు మొదటి నుంచి నిరసనకు దిగడం పట్ల ఇష్టం లేదని, తనకు తెలియకుండా తన సంతకం కూడా జతచేసి నిరసన చేపట్టారని, తనకు ప్రధాని మోడీపై నమ్మకం ఉందని , ఏదైనా డిమాండు ఉంటే న్యాయవ్యవస్థ ద్వారా అంతా మంచే జరుగుతుందని, ఎటువంటి ఆరోపణలపై అయినా దర్యాప్తుతో నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News