Sunday, December 22, 2024

న్యాయం జరిగే వరకూ పోరాటం.. జంతర్‌మంతర్ వద్ద మళ్లీ రెజ్లర్ల ఆందోళన

- Advertisement -
- Advertisement -

న్యాయం జరిగే వరకూ పోరాటం
జంతర్‌మంతర్ వద్ద మళ్లీ రెజ్లర్ల ఆందోళన
డబ్లూఎఫ్‌ఐ చీఫ్‌పై చర్యలకు పట్టు
న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పూనియా, సాక్షిమాలిక్, కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత వినేశ్‌ఫోగాట్‌తో సహా భారత టాప్ రెజ్లర్లు మళ్లీ ఆందోళన బాట పట్టారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆదివారం ఆందోళనకు దిగారు. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్లూఎఫ్‌ఐ)తోపాటు ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితంరెజ్లర్లు డబ్లూఎఫ్‌ఐ చీఫ్ సింగ్ లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. అప్పటినుంచి డబ్లూఎఫ్‌ఐ చీఫ్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ మరోసారి ఆదివారం దిగారు.

Also Read: ఆర్చరీ ప్రపంచకప్ 2023: భారత్‌కు నాలుగు పతకాలు..

ఈ సందర్భంగా వినేశ్ ఫోగాట్ మీడియాతో మాట్లాడుతూ సింగ్‌పై చేసిన లైంగిక వేధింపులకు సంబంధించి పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. సింగ్‌పై ఫిర్యాదు చేసిన మహిళా రెజ్లర్లులో ఓ మైనర్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీలోని కన్నాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని అయితే ఇప్పటికి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్నారు. మైనరుతో సహా మొత్తం ఏడుగురు మహిళా రెజ్లర్లు డబ్లూఎఫ్‌ఐ చీఫ్‌పై సింగ్‌పై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇది పోస్కో కేసు అవుతోందని అయినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మీడియా సమావేశంలో ఒలింపిక్ పతక విజేత ఆరోపించారు.

కాగా డబ్లూఎఫ్‌ఐ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రెజ్లర్లు ఆరోపించారు. కేంద్ర క్రీడాశాఖ మేరీకోమ్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసి రెజ్లర్ల ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని అయితే కమిటీ ఇంకా నివేదిక అందజేయలేదు. గత మూడు నెలలుగా సభ్యులును, కేంద్ర క్రీడాశాఖను కలిసేందుకు ప్రయత్నించినా రాలేదని, దీంతో తమకు న్యాయం జరిగే వరకూ పోరాడాలని నిర్ణయించుకున్నామని అప్పటివరకూ జంతర్‌మంతర్ వద్ద ధర్మా కొనసాగిస్తామని వినేశ్ ఆదివారం మీడియాకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News