న్యూఢిల్లీ: నిరసన చేస్తున్న మల్లయోధులు(రెజ్లర్లు) పోలీస్ బారికెడ్లపై నుంచి దూకి నూతన పార్లమెంటు భవనం వైపుకు పోయే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని ఆపేశారు. పోలీసులను భారీ సంఖ్యలోనే మోహరించి ఉంచడంతో రెజ్లర్లు ముందుకు పోలేకపోయారు. కాగా ప్రాథమిక నివేదిక ప్రకారం సాక్షి మలిక్, సంగీత ఫోగట్‌లను పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
‘మేము పార్లమెంటు వైపు శాంతియుతంగా త్రివర్ణ పతాకాలను చేబూని నడుస్తుండగా బలగాలు మమ్మల్ని అడ్డుకున్నాయి. మేము ఏ బారికేడ్లను విరగొట్టాము? అనవసరంగా పోలీసులు, అడ్మినిష్ర్టేన్ మమ్మల్ని నిందిస్తున్నారు’ అని బజరంగ్ పునియా తెలిపారు.
అనేక మంది ఖాప్ పంచాయతీ నాయకులను కూడా ముందుకు పోకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా జంతర్ మంతర్ నుంచి కొత్త పార్లమెంటుకు వెళుతున్న దారిలో అనేక బారికేడ్లను ఏర్పాటు చేశారు. వేలాదిగా పోలీసులను మోహరించారు. ముఖ్యంగా తిక్రి, ఘాజీపూర్, సింఘు, బదర్‌పూర్ తదిరత బార్డర్ ప్రాంతాల్లో వారిని మోహరించారు. సరిహద్దు నుంచి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
శాంతి భద్రతలను కాపాడేందుకు ఒకవేళ పెద్ద సంఖ్యలో ఎవరినైనా నిర్బంధంలోకి తీసుకుంటే వారిని కంఝ్‌వాలా చౌక్ వద్ద ఉన్న ఎంసి ప్రైమరీ గర్ల్ స్కూల్ వద్ద ఉన్న తాత్కాలిక జైలులో ఉంచేందుకు పోలీసులు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసిడి) నుంచి అనుమతి తీసుకున్నారు.
VIDEO | Protesters marching towards the new Parliament building being detained by police. pic.twitter.com/TXI6GsFKCr
— Press Trust of India (@PTI_News) May 28, 2023