Monday, December 23, 2024

లైంగిక వేధింపులు సర్వసాధారణం: పిటి ఉషపై రెజ్లర్లు ఫైర్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పి.టి. ఉషపై రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, భజరంగ్ పూనియా తదితరులు తీవ్ర విమర్శలు గుప్పించారు. కీలక పదవిలో ఉన్న ఉష రెజ్లర్లపై అర్థరహిత విమర్శలు దిగడం సరికాదని వారు పేర్కొన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన రెజ్లర్లు పిటి ఉష వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండించారు. క్రీడల్లో లైంగిక వేధింపులు అనేవి సర్వసాధారణం అని పిటి.ఉష పేర్కొనడం విడ్డూరమన్నారు. లెజెండరీ అథ్లెట్‌గా ఉష అంటే తమకు ఎంతో గౌరవమన్నారు. అయితే ఆమె కూడా రాజకీయ అవసరాల కోసం అర్థపర్థంలేని విమర్శలు చేయడం ఎంతో బాధించిందని వినేశ్ ఫొగాట్ ఆవేదన వ్యక్తం చేసింది. రెజ్లర్లను మానసిక వేధింపులకు గురి చేసిన డబ్లూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకునేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

ఇదిలావుంటే మహిళా రెజ్లర్లకు అండగా నిలవాల్సిన ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని రెజ్లర్లు తీవ్రంగా తప్పుపట్టారు. ఎవరూ ఎలాంటి వేధింపులకు గురి చేసిన తమ ఆందోళన కొనసాగుతుందని రెజ్లర్లు స్పష్టం చేశారు. మరోవైపు రెజ్లరు రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు వెల్లువెత్తుతోంది. మంగళవారం ప్రముఖ రైతు ఉద్యమ నాయకుడు తికాయత్ రెజ్లర్ల నిరహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రెజ్లర్లకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

Also Read: పెను ప్రకంపనలు సృష్టించిన వాగ్వాదం.. గంభీర్‌, కోహ్లికి భారీ జరిమానా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News