Monday, December 23, 2024

కేంద్రంతో చర్చలు సఫలం.. మెట్టుదిగిన రెజ్లర్లు

- Advertisement -
- Advertisement -

మెట్టుదిగిన రెజ్లర్లు
క్రీడా మంత్రి అనురాగ్‌తో చర్చలు సఫలం
ఆందోళనకు తాత్కాలిక విరామం
న్యూఢిల్లీ: సుదీర్ఘ రోజులుగా కొనసాగుతున్న భారత స్టార్ల రెజ్లర్ల నిరసన కార్యక్రమానికి బ్రేక్ పడింది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో జరిగిన చర్చల అనంతరం రెజ్లర్లు తమ ఆందోళనను తాత్కాలిక విరమిస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రాత పూర్వక హామీ ఇవ్వడంతో రెజ్లర్లు ఆందోళనను విరమించారు. అయితే దీని కోసం జూన్ 15 వరకు డెడ్‌లైన్ విధించారు. ఆ లోపు తమ సమస్యలను పరిష్కరించకపోతే తిరిగి ఆందోళన చేపడుతామని రెజ్లర్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టార్ రెజ్లర్లు సాక్షి మలిక్, భజరంగ్ పూనియా తదితరులు వెల్లడించారు.

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్‌భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం రాత పూర్వకంగా హామీ ఇవ్వడంతో రెజ్లర్లు ఓ మెట్టుదిగారు. ప్రభుత్వంకు జూన్ 15 వరకు గడువు ఇచ్చిన రెజ్లర్లు అప్పటి వరకు ఆందోళన విరమిస్తున్నట్టు పేర్కొన్నారు. బ్రిబ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైనా అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముందుకు రావడం లేదు. దీంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రెజ్లర్ల నిరసనకు మద్దతు వెల్లువెత్తుతుండడంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు దిగింది. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే రెజ్లర్లతో రహాస్యంగా చర్చలు జరిపారు.

అయితే ఇది సత్ఫలితం ఇవ్వక పోవడంతో తాజాగా కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ రంగంలోకి దిగారు. బుధవారం రెజ్లర్లతో జరిపిన చర్చలు సఫలం కావడంతో నిరసనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. బ్రిజ్‌భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై జూన్ 15లోగా పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. అంతేగాక ఈ క్రమంలో రాత పూర్వకంగా రాసిచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన రెజ్లర్లు తమ నిరసనకు విరామం కల్పించారు. ఈ విషయాన్ని ఇటు రెజ్లర్లు, అటు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వేర్వేరు మీడియా సమావేశాల్లో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News