Saturday, November 9, 2024

ఏషియన్ గేమ్స్‌కు వెళ్లం

- Advertisement -
- Advertisement -

ఏషియన్ గేమ్స్ బహిష్కరిస్తాం
15లోగా న్యాయం జరగాల్సిందే
హర్యానా పంచాయత్‌లో రెజ్లర్ల అల్టిమేటం
సోనేపట్ : రెజ్లర్ల సమాఖ్య నేత బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై ఈ నెల 15లోగా చర్యలు తీసుకోకపోతే తమ ఉద్యమం తిరిగి చేపడుతామని, ఏషియన్ గేమ్స్‌ను బహిష్కరిస్తామని ప్రముఖ రెజ్లర్లు హెచ్చరించారు. ఇప్పటికీ సింగ్ తన పలుకుబడిని వినియోగించుకుంటూ దర్జాగా తిరుగుతున్నాడు. పైగా రాజీపడేలా చేసేందుకు ఒత్తిళ్లకు గురి చేస్తున్నాడని రెజ్లర్లు హర్యానాలోని సోనెపట్ జిల్లాలోని చోటూ రామ్ ధర్మశాలలో పంచాయత్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సెప్టెంబర్ నుంచి ఏషియన్ గేమ్స్ జరుగుతాయి. పలు పతాకాలు సాధించి దేశ ప్రతిష్టకు వీర ప్రతిష్ట తెచ్చిపెట్టిన వీరు ప్రతిష్టాత్మక గేమ్స్‌లో పాల్గొనకపోతే ప్రపంచవ్యాప్త చర్చకు దారితీస్తుంది.

తాము న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నామని, లైంగిక వేధింపులకు గురైన వారిలో మైనర్ కూడా ఉన్నారని, సింగ్‌పై ఎటువంటి చర్య తీసుకోకపోవడం, ఈ క్రమంలో తమపై అన్ని రకాల ఒత్తిళ్లు తీసుకువచ్చి, రాజీకి వచ్చేలా చూడటం వంటి పనులు జరుగుతున్నాయని తెలిపిన రెజ్లర్లు ఇక్కడ హాజరైన వివిధ వర్గాల వారికి తమ ఆవేదన తెలియచేసుకున్నారు. క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తమకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారని, 15లోగా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారని, దీనితో తాము తాత్కాలికంగా ఉద్యమం నిలిపివేశామని ఒలింపిక్ పతాక విజేత సాక్షి మాలిక్ తెలిపారు. తాము తమపై జరిగిన పలు రకాల వేధింపులను సహిస్తూ వచ్చామని, న్యాయం కోసం తిరుగులేని ఉద్యమం జరుగుతుందని తెలిపిన ఆమె మంత్రి చెప్పినట్లు 15లోగా ఇది జరగకపోతే తాము ఏషియన్ గేమ్స్‌కు వెళ్లేది లేదని ప్రకటించారు. ఈ పంచాయత్‌లో రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు అనేకులు పాల్గొన్నారు. సమాఖ్య నేత నుంచి వేధింపులకు గురైన మైనర్ తండ్రికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News