న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెలరోజులకు పైగా నిరసన కొనసాగిస్తున్న మహిళా రెజ్లర్లు తమ నిరసనలో భాగంగా పవిత్ర గంగానదిలో తమ పతకాలను నిమజ్జనం చేసేందుకు మంగళవారం సాయంత్రం హరిద్వార్ బయల్దేరి వెళుతున్నారు. హరిద్వార్ నుంచి న్యూఢిల్లీకి తిరిగివచ్చిన తర్వాత ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరహార దీక్ష చేపడతామని నిరసనకారులు ప్రకటించారు. వీరిలో బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సాఓఇ మాలిక్ తదితరులు ఉన్నారు.
ట్విటర్ వేదికగా మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తమపై ఢిల్లీ పోలీసుల చర్యను రెజ్లర్లు తీవ్రంగా ఖండించారు.
పవిత్ర గంగా నదిలో తాము గెలుచుకున్న పతకాలను విసర్జించనున్నామని వారు తెలిపారు. ఈ పతకాలు తమ జీవిలని, తమ ప్రాణాలని వారు తెలిపారు. గంగా నదిలో వాటిని విసర్జించిన తరోవాత తాము జీవించి అర్థం లే౦దని వారు పేర్కొన్నారు. అందుకే వాటిని విసర్జించిన తర్వాత ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని వారు తెలిపారు. తమను తన సొంత బిడ్డలంటూ చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ తమ పట్ల ఒక్క సారి కూడా ఆవేదన వ్యక్తం చేయలేదని నిరసనకారులు తెలిపారు. పైగా కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి బ్రిజ్ భూషణ్ సింగ్‌ను ప్రధాని ఆహ్వానించారని వారు పేర్కొన్నారు.