Thursday, November 14, 2024

సంకల్పానికి అవిటితనం అడ్డురాదు..

- Advertisement -
- Advertisement -

కుబీర్ : కృషి పట్టుదల ఉంటే అవిటితనం అడ్డురాదని నిరూపించాడు మండలంలోని రంజిని గ్రామంలో గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న మహాలక్షీమ, మహా జాతరలో శుక్రవారం ఘనంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీలు కర్కెల్లి గ్రామానికి చెందిన యువకునికి ఒక చేయి మాత్రమే ఉంది. ఒక చేయితోనే కుస్తీ బరిలో దిగి ప్రత్యర్థిని మట్టికరించి కుస్తీ పోటీలో గెలుపొంది అందరి మన్ననలు పొందాడు. కృషి పట్టుదల ఉంటే అవిటితనం అడ్డురాదని నిరూపించాడు. ఈ కుస్తీ పోటీలకు మహారాష్ట్ర చుట్టుపక్కల మండలాల నుండి పెద్ద సంఖ్యలో మల్లయోధులు వచ్చి కుస్తీ పోటీలో తలపడ్డారు.

చివరి కుస్తీ పోటీలో మొదటి బహుమతి 5051, ద్వితీయ బహుమతి 3000 గా ప్రకటించి గెలుపొందిన వారికి శాలువాతో సత్కరించి బహుమతిని అందజేశారు. ఈ కుస్తీ పోటీలకు మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వీక్షించి కేరింతలతో పండగ వాతావరణం సృష్టించారు. ఈ కార్యక్రమంలో విడిసి చైర్మెన్ దేవెందర్, గ్రామ సర్పంచ్ రంగరావు, ఎంపిటిసి హన్మండ్లు, అనిల్ కుమాఱ్, సాయినాథ్, మోహన్ సార్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News