Sunday, January 19, 2025

రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు వాయిదా!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. శనివారం జరగాల్సిన ఎన్నికలను మరోసారి వాయిదా వేశారు. పంజాబ్‌ హర్యానా హైకోర్టు రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలను తాత్కాలికంగా నిలిపి వేసింది. షెడ్యూల్ ప్రకారం శనివారం ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఎ) ప్రకారం జులై ఆరు నుంచి 11 మధ్య ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో ఎన్నికలను ఆగస్టు 12కు వాయిదా వేశారు. అయితే తాజాగా పంజాబ్‌హర్యానా కోర్టు జోక్యంతో ఎన్నికలు మరోసారి వాయిదా వేయక తప్పలేదు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఇంకా తేలాల్సి ఉంది.

ఇదిలావుంటే భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న లోక్‌సభ సభ్యుడు బ్రిజ్‌భూషణ్‌పై కొంత మంది మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేశారు. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినేశ్ ఫొగట్, సాక్షిమలిక్‌తో సహా పలువురు స్టార్ రెజ్లర్లు చాలా రోజుల పాటు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తీవ్ర రూపం దాల్చింది. దీంతో భారత ఒలింపిక్ సంఘం రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసింది. సమాఖ్యను రద్దు చేయడంతో కొత్త కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News