Wednesday, January 22, 2025

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రద్దు

- Advertisement -
- Advertisement -

 మహిళా రెజ్లర్ల హర్షం
 తొలి విజయమంటూ సంబురాలు
న్యూఢిల్లీ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆప్ ఇండియా చీఫ్ బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడంటూ అతన్ని అరెస్టు చేయాలని మూడు వారాలుగా మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్నా.. వెంటనే బ్రిజ్‌భూషణ్ అరెస్టు చేయాలని భారత అత్యున్న న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా ఇంకా నిందితున్న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయకపోవడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా, ఆదివారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిలీని రద్దు చేసి, భారత ఒలింపిక్ సంఘం లో చేర్చుకుంది. దీంతో భారత మహిళా రెజ్లర్లు తమకు మొదటి విజమనిపేర్కొన్నారు.

లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్లుఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని క్రీడాకారులు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫొగట్‌తో పాటు వారికి వివిధ సంఘాల వారు మద్దతిస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా, బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినప్పటికీ ఇంకా అరెస్టు చేయలేదు. రెజ్లింగ్ ఫెడరేషన్‌కు చెందిన అన్ని అధికారిక పత్రాలను తాత్కాలిక కమిటీకి అందజేయాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ డబ్లుఫ్‌ఐ సెక్రటరీ జనరల్ విఎన్ ప్రసూద్‌ను ఆదేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News