Friday, December 27, 2024

రెజ్లర్ల గోదాకు పోటీ ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వచ్చే నెల 4వ తేదీన భారత రెజ్లర్ల సమాఖ్య (డబ్లుఎఫ్‌ఐ) ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు రిటైర్డ్ జస్టిస్ మహేష్ మిట్టల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఇండియన్ ఒలంపిక్స్ అసోసియేషన్ (ఐఒఎ) అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని రెజ్లర్ల సమాఖ్య ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటి సమాఖ్య అధ్యక్షులు , రెజ్లర్లపై లైంగిక వేధింపులకు దిగారనే ఆరోపణలు వెలువడ్డ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను ఇప్పటికే పదవి నుంచి తీసివేశారు. పాత పాలక మండలి రద్దు అయింది. దీనితో కొత్త పాలకమండలి ఎన్నికకు ఐఒఎ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే బాధ్యతలను జమ్మూ కశ్మీర్ విశ్రాంత న్యాయమూర్తి మహేశ్ మిట్టల్ కుమార్‌కు అప్పగించారు.

డబ్లుఎఫ్‌ఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఈ సమాఖ్య కార్యవర్గ కమిటీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు , సంబంధిత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐఒఎ తెలిపింది. తామైతే ఎన్నికలకు జులై 4వ తేదీని ఖరారు చేశామని అయితే జస్టిస్ మిట్టల్ తమ సౌలభ్యం మేరకు ఎన్నికల తేదీ, ప్రత్యేక కార్యవర్గ భేటీ తేదీని ఖరారు చేయవచ్చునని, 4వతేదీ ఎన్నికకు కూడా సిద్ధం అని ఒలంపిక్ సంఘం తెలిపింది. ప్రస్తుత సమాఖ్య నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ఎప్రిల్ 27న త్రిసభ్య కమిటీని ఐఒఎ ఏర్పాటు చేసింది. రోజువారి కార్యక్రమాల కోసం క్రీడా మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఇద్దరు సభ్యులను నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News