Saturday, December 21, 2024

’రైటర్ పద్మభూషణ్‌ గొప్ప అనుభూతిని ఇస్తుంది: టీతను శిల్పరాజ్

- Advertisement -
- Advertisement -

 

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతను దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీతను శిల్పరాజ్ కథాతనుయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్తనురు. ఇప్పటికే ఈ సినిమా ప్రిమియర్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ టీతను శిల్పరాజ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

రైటర్ పద్మభూషణ్‌ జర్నీ ఎలా మొదలైయింది,ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు అని అడగగా తను తెలుగమ్మాయినే. మాది హైదరాబాద్. రైటర్ పద్మభూషణ్‌ కి పని చేసిన కాస్టూమ్ డిజైనర్ ద్వారా ఆడిషన్ కాల్ వచ్చిందని, అంతకుముందు ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’కి మేము కలసి పని చేశామని చెప్పుకొచ్చారు. రైటర్ పద్మభూషణ్‌ కి ఆడిషన్స్ ఇచ్చానని, తర్వాత సుహాస్ గారితో లుక్ టెస్ట్ జరిగిందని తెలిపారు. . ఈ సినిమా వస్తుందని బలంగా నమ్మానని, తను నమ్మినట్లే సినిమా రావడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్తనురు.

రైటర్ పద్మభూషణ్‌ మూవీ ఎలా ఉండబోతుందని, ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందని అడగగా రైటర్ పద్మభూషణ్‌ ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ రైడ్ కి తీసుకెళుతుందని, చాలా కామెడీ వుంటుందని తెలిపారు. హ్యాపీ ఎమోషన్స్ వుంటాయని,ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకులు ఎక్స్ పీరియన్స్ చేస్తారని పేర్కొన్తనురు.

రైటర్ పద్మభూషణ్‌ లో తను పాత్ర పేరు సారిక. సారిక విజయవాడ అమ్మాయి అని , పద్మభూషణ్ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కథలో చాలా కీలకమైన పాత్ర అని, దర్శకుడు ప్రశాంత్ సారిక పాత్రని చాలా అద్భుతంగా రాసారని, తన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుందని, ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రశాంత్ కి దక్కుతుందని తెలిపారు.

రైటర్ పద్మభూషణ్‌ ప్రిమియర్స్ కి చాలా అద్భుతమైన స్పందన వచ్చిందని అన్నారు. విజయవాడ ప్రిమియర్ కి వచ్చిన స్పందన చూసి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని, థియేటర్ నిండిపోయింది, మేము స్టేజ్ పై నిలబడి చూశామని చెప్పారు. ప్రేక్షకులంతా సినిమాకి చాలా గొప్పగా కనెక్ట్ అయ్యారని, గుంటూరు, భీమవరంలో కూడా ప్రేక్షకులు నవ్వినవ్వి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం చూసినపుడు మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లనిపించిందని అన్నారు.

రైటర్ పద్మభూషణ్‌ గ్రేట్ జర్నీ అని, ఇంతకుముందు ఒక సినిమాకి సహాయ దర్శకురాలిగా పని చేయడం వలన సినిమా గురించి అవగాహన వుందని, అయితే ఒక యాక్టర్ గా మనల్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమని, మన బలాలు ఏంటి ? బలహీనతలు ఏంటి ? ఎక్కడ మనం బాగా చేయగలుగుతున్నాను, ఎక్కడ ఇంకా మెరుగుపరుచుకోవాలి ? ఇలా చాలా విషయాలు రైటర్ పద్మభూషణ్‌ ప్రయాణంలో నేర్చుకున్న అని అన్నారు.

ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స వండర్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్. కొత్త ప్రతిభని ఎంతగానో ప్రోత్సహిస్తారు. తెలుగు పాప్ కల్చర్ లో చాలా పాపులర్. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ లో తను మొదటి సినిమా కావడం చాలా ఆనందంగా వుంది.

రోహిణీ గారు, ఆశిష్ విద్యార్ధి గారు లాంటి సీనియర్స్ తో పని చేయడం మర్చిపోలేని అనుభవం. రోహిణీ గారు, ఆశిష్ విద్యార్ధి గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను, వాళ్లతో కలసి నటించడం గ్రేట్ ఫీలింగ్ అని అన్నారు.

రైటర్ పద్మభూషణ్‌ అందరూ తప్పక చూడాల్సిన సినిమా. అందరూ కనెక్ట్ అవుతారని, రైటర్ పద్మభూషణ్‌ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప అనుభూతిని ఇస్తుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News