అసోంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సారథ్యంలోని బిజెపి ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటున్నదని ప్రతిపక్షాలు,విమర్శకుల ఆరోపణలకు గురైంది. 2021 ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) 75 సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకున్నది. ఆ విజయానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొంత వరకు కారణమనే వ్యాఖ్యలు వచ్చాయి. బలహీన వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం అందజేసే ‘ఒరుణోదయ్’, ఆరోగ్య సేవల దన్ను లక్షమైన ‘అసోం ఆరోగ్య నిధి’ వంటి పథకాల గురించి ఎన్నికల ప్రచార సమయంలో భారీ ఎత్తున ప్రస్తావించారు. ఆ పథకాలను వ్యూహాత్మకంగా ఎన్నికల సమయంలో వినియోగించుకున్నారని, అభివృద్ధి కేవలం ధ్యేయమైనా ముఖ్యం గా మహిళలు, గ్రామీణ జనాభాలో ఓటర్ల మద్దతును మరింత సంపాదించడం లక్షంగా చేసుకున్నారని కాంగ్రెస్, అఖిల భారత సమైక్య ప్రజాస్వామిక ఫ్రంట్ (ఎఐయుడిఎఫ్) సహా విమర్శకుల నుంచి ఆరోపణలు వచ్చాయి.
పదేపదే వచ్చిన ఆరోపణ ఏమిటంటే ఎవరో కొందరికే ప్రయోజనాలు అందజేశారన్నది. 2021 ఎన్నికలకు ముందు 2020 డిసెంబర్‌లో ప్రారంభించిన ‘ఒరుణోదయ్’ పథకం కింద 19 లక్షల మంది లబ్ధిదారులకు, ముఖ్యంగా మహిళలకు నెలకు రూ. 830 అందజేశారు. బిజెపి గట్టి పోటీ ఎదుర్కొన్న నియోజకవర్గాల్లో ఆ నిధులు పంపిణీ చేశారని, లబ్ధిదారుల జాబితాల్లో తేయాకు తోటల సమాజాలు, హిందు ఆధిక్య ప్రాంతాలు వంటి బలమైన బిజెపి మద్దతు ప్రాంతాలను చేర్చారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. విస్తృతంగా అవకతవకలు జరిగాయనేందుకు పటిష్టమైనా ఆధారాలు లేవు, కానీ 2021 మార్చి ఏప్రిల్ ఎన్నికలకు సరిగ్గా కొన్ని నెలలకు ముందు అలా చేయడం ఎన్నికల ఇంజనీరింగ్ గురించి అభిప్రాయాల వ్యక్తీకరణకు దారితీసింది.మరొక ఉదాహరణ మౌలిక వసతుల కల్పన, సహాయ కార్యక్రమాల అమలు.
అసోంలో ఎడతెగని సమస్యగా ఉంటున్న వరద సహాయం, పునరావాసం గురించి బిజెపి ప్రభుత్వం నొక్కిచెప్పింది. సహాయ ప్యాకేజీల పంపిణీ, కరకట్టల నిర్మాణం వంటి అభివృద్ధి ప్రాజెక్టులపై వాగ్దానం గురించి ప్రభుత్వం వివరించింది. 2024 ఉప ఎన్నికల్లో ఎన్‌డిఎ తాను పోటీ చేసిన ఐదు సీట్లనూ గెలుచుకోగా, కీలక నియోజకవర్గాల్లో ఓటర్లు లక్షంగా నగదు బదలీలు, ఆహార కిట్లు, ఉద్యోగాల వాగ్దానాలు వంటి ప్రభుత్వ పథకాలను ముమ్మరం చేశారనే వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ వంటి ప్రతిపక్ష నేతలు ఆ చర్యలను ‘ఓటు కొనుగోలు ఎత్తుగడలు’గా విమర్శించారు. పాలనకు, ఎన్నికల ప్రచారానికి మధ్య గీతను ప్రభుత్వం దాటిందని వారు ఆరోపించారు.‘ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన’ (గృహ వసతి), ‘ఉజ్వల యోజన’ (ఎల్‌పిజి కనెక్షన్లు) వంటి పథకాలతో కలగలిపి అభివృద్ధి లక్షంగా సాగుతున్నామన్న బిజెపి వ్యాఖ్యలు పార్టీ అప్పీల్‌కు మూలక కారణం అయింది.2021లో లక్ష మందికి పైగా యువతకు ఉపాధి కల్పించామని పార్టీ తెలిపింది.
కానీ ఆ సంఖ్యను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి. కొనసాగుతున్న నిరుద్యోగితను ఆ పార్టీలు ప్రస్తావించాయి. ఉపాధి కల్పన శిబిరాలు, రిక్రూట్‌మెంట్ కార్యక్రమాల గురించి బిజెపి కోటల్లోనే విస్తృతంగా ప్రచారం చేశారని ప్రతిపక్షాలు వాదించాయి. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పురోగతి కనిపించలేదని అవి ఆరోపించాయి.అదే విధంగా ముఖ్యమైన ఓటింగ్ వర్గమైన తేయాకు తోటల కార్మికులు వేతనాల హెచ్చింపులు, భూమి హక్కుల వాగ్దానాలు వంటి లక్షిత ప్రయోజనాలు అందుకున్నారు. వారు షెడ్యూల్డ్ తెగల హోదా కోసం దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్లు నెరవేర్చకపోయినప్పటికీ వారి విధేయతను సాధించడానికి బిజెపి వాటి గురించి ప్రధానంగా చెప్పుకున్నది.
2026 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బిజెపి అటువంటి వ్యూహాలను తిరిగి అనుసరించవచ్చు. మహిళలు, యువజనులు, దేశీ తెగల సమాజాలు వంటి వర్గాలపై దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వం ప్రస్తుత పథకాలను ముమ్మరం చేయవచ్చు లేదా ఎన్నికలకు సరిగ్గా ముందు కొత్త పథకాలను ప్రవేశపెట్టవచ్చు. బిజెపి ప్రభావిత ప్రాంతాలకు ఆ పథకాలు ప్రత్యేక ప్రయోజనం చేకూర్చేలా ఉన్నట్లు కనిపిస్తే లేదా అర్హత నిబంధనలు రాజకీయ ఉద్దేశంతో నిర్ణయించినట్లు కనిపిస్తే వాటి దుర్వినియోగం గురించి విమర్శకులు మళ్లీ ఆరోపించవచ్చు. అయితే, అటువంటి వాదనలు ఊహాజనితంగా ఉండవచ్చు, పూర్వపు ధోరణులు ఆధారితంగా ఉండవచ్చు.సంక్షేమ పథకాలు తమ పాలన నమూనాలో భాగమని, ఎన్నికల ఎత్తుగడలు కావని, రాజకీయ అనుబంధం బట్టి కాకుండా అవసరాన్ని బట్టి ప్రయోజనాల పంపిణీ జరుగుతోందని స్పష్టం చేస్తూ బిజెపి ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.
అసోం సిఎం హిమంత బిశ్వ శర్మ ‘అస్సామీస్ అస్తిత్వంతో అభివృద్ధి’ని అసలు సిసలైన విజయంగా తరచూ స్పష్టం చేస్తున్నారు, ప్రతిపక్ష విమర్శకులను ‘అందని ద్రాక్ష పుల్లన’ అనేటటువంటివారని ఆయన పేర్కొన్నారు.2021లో ఎన్నికైన 15వ అసోం శాసనసభ ప్రస్తుత గడువు ముగింపునకు సూచికగా తదుపరి అసోం శాసనసభ ఎన్నికలు 2026లో జరగవలసి ఉన్నాయి. శర్మ రాజకీయ ప్రస్థాన రికార్డు ఆధారంగా, అసోంలో బిజెపి గత ఎన్నికల వ్యూహాలు (ముఖ్యంగా 2021 విజయం, 2024 ఉప ఎన్నికలు), రాష్ట్ర ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితుల దృష్టా ఆ వ్యూహాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చునని మనం భావించవచ్చు. అస్సామీయుల జాతీయవాదం రాజకీయ సమీకరణాల పటిష్టత శర్మ నేర్పుగా అస్సామీయుల ఉప జాతీయవాదాన్ని బిజెపి హిందుత్వ అజెండాతో మిళితం చేశారు.
‘ఆక్రమణదారులను’ (తరచు బెంగాలీ మాట్లాడే ముస్లింలను లక్షంగా) ఖాళీ చేయించడం, డీలిమిటేషన్ (దేశీ జాతుల వర్గాలకు అనుకూలంగా 2023లో పూర్తయినది) కోసం ఒత్తిడి తీసుకురావడం వంటి విధానాలు మైనారిటీలను ముఖ్యంగా దిగువ అసోంలోని వారిని పక్కనపెడుతూ అస్సామీయుల హిందు ఓట్లు రాబట్టే వ్యూహానికి సంకేతాలు. వివాదాస్పదమైనప్పటికీ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలును జాతీయవాద శక్తులను ఆకర్షిస్తూ, దేశీ జాతుల హక్కుల పరిరక్షిస్తూ సాగించవచ్చు. ‘మియా’ (ముస్లిం)లకు వ్యతిరేకంగా శర్మ వైఖరి మతవర్గాల విభజనకు మరింత పదును చేర్చవచ్చు.ఎఐయుడిఎఫ్ కాంగ్రెస్ కూటమిని ఎదుర్కొనడానికి 2021లో ఉపయుక్తమైన ఎత్తుగడ అది.
అసోంలో బిజెపి విజయం, దాని ఎన్‌డిఎ మిత్రపక్షాలు, అసోం గణ పరిషత్ (ఎజిపి), బోడోలాండ్ టెర్రిటోరియల్ రీజియన్ (బిటిఆర్‌ఒ) కేంద్రంగా గల ప్రాంతీయ పార్టీ యునైటెడ్ పీపుల్స్ పార్టీ (యుపిపిఎల్)పై ఆధారపడి ఉంటుంది. 2021లో ఆ కూటమి 126 సీట్లలోకి 75 సీట్లను గెలుచుకున్నది. 2024 ఉప ఎన్నికల్లో అది తాను పోటీ చేసిన ఐదు సీట్లనూ కైవసం చేసుకున్నది. ఎగువ అసోంలో ఎజిపి, బోడోలాండ్ టెర్రిటోరియల్ రీజియన్ (బిటిఆర్)లో యుపిపిఎల్ తమ ప్రభావాన్ని నిలబెట్టుకునేలా చూస్తూ శర్మ ఈ కూటమిని కొనసాగించవచ్చు. బిటిఆర్‌కు అభివృద్ధి నిధుల లేదా స్వతంత్ర ప్రతిపత్తి వంటి రాయితీలు ఆదివాసీ మద్దతును దృఢతరం చేయగలవు. అదే సమయంలో ఆయన ప్రత్యర్థులపై స్థానిక సమస్యలను తీవ్రమైనవిగా చూపుతూ ప్రతిపక్ష కోటలను దెబ్బ తీయవచ్చు.
పదునైన విమర్శలకు, అట్టడుగు ప్రాంతాల్లో జనంతో అనుబంధానికి పేరొందిన అసోం ముఖ్యమంత్రి శర్మ అత్యంత ఉధృత ప్రచారానికి సారథ్యం వహించవచ్చు.తన ‘క్రియాశీల’ పాలనకు ప్రతిపక్షాల జడత్వంతో ముడిపెట్టి తన ‘క్రియాశీల’ తరహా పాలనకు భిన్నంగా ఆయన ఆ ప్రచారం సాగించవచ్చు. 2015లో కాంగ్రెస్ నుంచి బిజెపికి ఆయన ఫిరాయింపు, ఆ తదుపరి నాయకత్వ పాత్ర వహించడం పార్టీ బలాన్ని పెంచింది. 2026 నాటికి ర్యాలీలు, సామాజిక మాధ్యమ ప్రచారాలు, వాగ్దానాల పరంపరను ఊహించవచ్చు. ప్రతిపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్, ఎఐయుడిఎఫ్ అంతర్గత కలహాలతో, పటిష్టమైన నాయకత్వ లేమితో ఇబ్బందిపడ్డాయి. శర్మ కాంగ్రెస్ నేతలను ఆకర్షించడం ద్వారా 2021లో దీనిని సద్వినియోగం చేసుకున్నారు. ఆయన ఈ వ్యూహాన్ని కొనసాగించవచ్చు, అసంతుష్ట ఎంఎల్‌ఎలను ప్రలోభపెట్టడాన్ని లేదా న్యాయపరమైన లేదా పాలనపరమైన ఒత్తిడి ద్వారా ప్రత్యర్థులను పక్కన పెట్టడాన్ని ఆయన అనుసరించవచ్చు.
బిజెపి ప్రభావిత ప్రాంతాలకు అనుకూలంగా నియోజకవర్గాలను రూపొందించిన డీలిమిటేషన్ ప్రక్రియ ప్రతిపక్షాల అవకాశాలను మరింత బలహీనపరచవచ్చు. అయితే, ప్రతిపక్షాలు తమ గత పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోగలవని ఊహాగానాలు సాగుతున్నాయి. కొనసాగుతున్న నిరుద్యోగిత, వరద సంబంధిత నిరాశ్రయం, సిఎఎ లేదా దేశీజాతుల హక్కులపై అసంతృప్తి ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూర్చవచ్చు. కాంగ్రెస్, ఎఐయుడిఎఫ్ మరింత బలమైన కూటమిని ఏర్పాటు చేస్తే లేదా అసోం జాతీయ పరిషత్ వంటి ప్రాంతీయ పార్టీలు బలం పొందితే బిజెపి ఆధిపత్యానికి పరీక్ష ఎదురుకావచ్చు.
అవినీతి ఆరోపణలు, ఖాళీ చేయించే కార్యక్రమాలు కూడా ఓటర్లను దూరం చేయవచ్చు. కొన్ని ఆశావహ ప్రాజెక్టుల కోసం శర్మ ప్రభుత్వం భారీగా రుణాలు స్వీకరిస్తోంది. అసోం ప్రభుత్వ రుణాలు రూ. 1.52 లక్షల కోట్లకు పెరిగాయి. శర్మ తన భార్య, ఇతర కుటుంబ సభ్యుల పేరిట పెక్కు స్థిరాస్తులు సమీకరించారనే ఆరోపణలు వచ్చాయి. ప్రతి పథకం నుంచి కొంత శాతం కమీషన్‌ను పార్టీ నిధికి, శక్తిమంతులైన రాజకీయ నాయకుల వ్యక్తిగత ఖజానాకు మళ్లించారు. తన విమర్శకులు, ప్రతిపక్ష నాయకులు, విమర్శనాత్మక మీడియా పట్ల శర్మ కక్షపూరిత వైఖరి ప్రతిపక్షాలు వాటిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చు. ఉప ప్రతిపక్ష నాయకుడు గౌరబ్ గొగోయ్ పాపులర్, బలమైన నేతగా ఆవిర్భవించడం కూడా బిజెపి విజయానికి అడ్డుగోడ కావచ్చు.
2026 కోసం హిమంత బిశ్వశర్మ వ్యూహం బిజెపి 2021, 2026 విజయాలు ఆధారంగా సంక్షేమ ప్రజాకర్షణ పథకాలు, అస్తిత్వ రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాల సమ్మిళితం కాగల అవకాశం ఉంది. ఒక వైపు ప్రతిపక్షాల ఇరకాట పరిస్థితిని ఉపయోగించుకుంటూ, మరొకవైపు పథకాలు, మౌలిక వసతుల కల్పన, కూటముల ద్వారా తన ఓటర్ల బలాన్ని మరింత పెంచుకోవడాన్ని ఆయన ప్రభుత్వం లక్షం చేసుకోగలదు. పథకాల అమలు, ఓటర్ల సెంటిమెంట్‌పైన ఈ బహుళ దశ దాడిని ప్రతిపక్షాలు ఏవిధంగా తిప్పికొడతాయి అనేదానిపై ఎన్నికల ఫలితం ఆధారపడుతుంది.
– గీతార్థ పాఠక్- ఈశాన్యోపనిషత్