Wednesday, January 22, 2025

ఆగస్ట్ 7న ఎస్‌ఐ, 21 కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలు

- Advertisement -
- Advertisement -

Written test dates finalised for SI, constable

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం నాడు విడుదల చేసింది. ఈక్రమంలో ఆగస్టు 7న ఎస్‌ఐ, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు జరగనున్నాయని, ఎస్‌ఐ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి బోర్డు వైబ్‌సైట్ www.tslprb.inలో హాల్ టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. మొత్తం 554 ఎస్‌ఐ, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మరో 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు 2.54 లక్షల మంది అభ్యర్థులు ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షకు హాజరుకానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అలాగే కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్‌ఐ పోస్టులకు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 20 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు వివరించారు.

రికార్డు స్థాయిలో దరఖాస్తులు 

దాదాపు నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పోలీసు కొలువుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర పోలీసు శాఖలో 17,516 పోస్టుల భర్తీ కోసం సర్కారు ప్రకటన ఇవ్వగా అనూహ్యంగా అభ్యర్థుల నుంచి రికార్డు స్థాయిలో 12,91,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మహిళల నుంచి 2,76,311 దరఖాస్తులు(21 శాతం) వచ్చాయి. ఒక్కో సివిల్ ఎస్‌ఐ పోస్టుకు సగటున 447 మంది, కమ్యూనికేషన్స్ ఎస్‌ఐ పోస్టుకు 660, కానిస్టేబుల్ పోస్టుకు 59 మంది పోటీపడుతున్నారు. 2018లో 18,428 పోస్టులకు 7,19,840 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈసారి 17,516 పోస్టులకు రికార్డు స్థాయిలో 12,91,058 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే 80 శాతం మేర దరఖాస్తులు పెరిగాయి. మొత్తంగా 11 రకాల పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడగా అందులో ఒక పోస్టుకు 52 శాతం మంది, 2 పోస్టులకు 29 శాతం, 3 పోస్టులకు 15 శాతం, 4 పోస్టులకు 3 శాతం మంది దరఖాస్తులు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News