Saturday, November 16, 2024

ప్రశాంతంగా ముగిసిన వెల్డర్ ట్రైనీ పోస్టుల ఇంటర్నల్ అభ్యర్థుల రాత పరీక్ష

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం సింగరేణి : సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న 43 వెల్డర్ ట్రైనీ కేటగిరి1 పోస్టులు ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీ చేసేందుకు ఆదివారం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 34 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయగా 32 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైనట్లు జీఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ ఆర్‌సి కె.బసవయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్రాత పరీక్ష నిర్వహణ పూర్తిగా కంప్యూటర్ ద్వారా మానవ ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా, సెక్యురిటీ, విజిలెన్స్, సిసి కెమెరాల నిఘా మధ్య నిర్వహించడం జరిగింది. తొలుత అభ్యర్థుల ఆధార్ కార్డులోని వివరాలను పరిశీలించి, మెటల్ డిటెక్టర్‌లతో తనిఖీ చేసిన తరువాతనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించామన్నారు. ఈ పరీక్షను డిజిఎం విజిలెన్స్ శాస్త్రి, సెక్యూరిటీ జనరల్ మేనేజర్ బి.హనుమంతరావు పర్యవేక్షించారు. ఈ పరీక్షా ఫలితాలను సింగరేణి వెబ్‌సైట్ www,scclmines.comలోనూ, సాయంత్రం హెడ్ ఆఫీస్ మెయిన్ గేట్ నోటీస్ బోర్డ్‌లో వేస్తామన్నారు. ఈ పరీక్ష పరిశీలనలో డిజిఎం పర్సనల్‌లు ధన్‌పాల్ శ్రీనివాస్, వేణుగోపాల్, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శారద, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్, జాకీర్ హుస్సేన్, సంతోష్‌కుమార్, నాగేశ్వరరావు, ఇతర అధికారులు ఆర్‌సి, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News