Thursday, December 19, 2024

తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే: పువ్వాడ అజయ్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పొంగులేటి శ్రీనివాస్‌  రెడ్డి అనుచరుల కేసుల వ్యవహారానికి సంబంధించి పరోక్షంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వారు తమ పార్టీ సభ్యులైనా పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారికైనా ఇదే వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీఏ సేవలు ఎలా అందుతున్నాయో వాహనదారులను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశంలోనే ఎక్కడా లేని విధంగా రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా సాంకేతిక సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి హామీనిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News