Sunday, January 19, 2025

ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సైంధవ్’ 2024లో విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘సైంధవ్’ టీజర్‌కు నేషనల్ వైడ్‌గా అద్భుతమైన స్పందన వచ్చింది. మంగళవారం సినిమా ఫస్ట్ సింగిల్ ’రాంగ్ యూసేజ్’ని సిఎంఆర్, విఎన్‌ఆర్ కాలేజీల్లో నిర్వహించిన ఈవెంట్స్ లో లాంచ్ చేసి మేకర్స్ చాలా గ్రాండ్ గా మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు. సాంగ్ లాంచ్ ఈవెంట్స్ లో భారీగా హాజరైన విద్యార్ధులతో కలసి సందడి చేశారు విక్టరీ వెంకటేష్.

సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ పాట కోసం ఎక్స్ ట్రార్డినరీ క్యాచి నెంబర్ కంపోజ్ చేశారు. నకాష్ అజీజ్ తన ఎనర్జిటిక్ వోకల్స్ తో ఆకట్టుకున్నారు. ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డబ్బు, ప్రేమ, మనుషులు గురించి రాసిన అర్ధవంతమైన సాహిత్యం ఆడియన్స్‌ని అలరించింది. ఈ ఈవెంట్స్‌లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ “సైంధవ్ నా మనసుకు దగ్గరైన చిత్రం. నిర్మాత వెంకట్ చాలా గ్రాండ్‌గా నిర్మించారు. దర్శకుడు శైలేష్ అద్భుతంగా తెరకెక్కించారు.

సంతోష్ నారాయణ్, డీవోపీ మణికందన్ బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ చాలా న్యూ ఏజ్‌గా వుంటుంది. పండక్కి ఫ్యామిలీతో కలిసి అందరూ ఎంజాయ్ చేస్తారు”అని అన్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ “ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాలలో బెస్ట్ వర్క్ సైంధవ్. సినిమా చాలా బావుంటుందని నమ్మకంగా చెబుతున్నా”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వెంకట్ బోయనపల్లి, సంతోష్ నారాయణన్, మణికందన్ పాల్గొన్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్న ‘సైంధవ్’ జనవరి 13న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News