Thursday, January 23, 2025

టీమిండియా డబ్లూటిసి షెడ్యూల్ ఖరారు

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 202325కు సంబంధించిన టీమిండియా షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌తో భారత్ డబ్లూటిసి ఛాంపియన్‌షిప్‌కు శ్రీకారం చుట్టనుంది. ఈ క్రమంలో టీమిండియా మొత్తం 19 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు, బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఇక విదేశాల్లో విండీస్‌తో రెండు, సౌతాఫ్రికా రెండు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచుల్లో భారత్ తలపడనుంది. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే ఇంగ్లండ్ టీమ్ ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. జనవరిఫిబ్రవరిలో ఈ సిరీస్ జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News