Wednesday, January 22, 2025

స్మిత్ అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా మాజీ సారధి, స్టార్ బ్యాటర్ స్టీవ్‌స్మిత్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెస్టుల్లో 157 క్యాచ్‌లు అందుకున్న మూడో ఆసీస్ ప్లేయర్‌గా ఈ పీట్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో అలెన బోర్డర్(156) రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరులో భాగంగా టీమిండియాతో జరగుతున్న మ్యాచ్‌లో ఐదో రోజు ఆటలో తొలి సెషన్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన బంతిని గాల్లోకి ఎగిరి అందుకోవడం ద్వారా ఈ ఘనత సాధించాడు స్టీవ్ స్మిత్. స్లిప్‌లో మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేసే స్మిత్‌కు ముందు రికీపాంటింగ్(196) మొదటి స్థానంలో కొనసాగుతుండగా, మార్క్‌వా (181) క్యాచ్‌లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News