Wednesday, January 22, 2025

రోహిత్ వల్లే ఆస్ట్రేలియా దూకుడు: గంగూలీ ఫైర్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్లూటిసి ఫైనల్లో రోహిత్ కెప్టెన్సీ చాలా పేలవంగా ఉందన్నాడు. ఆరంభంలోనే కీలక వికెట్లను తీసినా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో రోహిత్ విఫలమయ్యాడన్నాడు. బౌలర్లను సందర్భోచితంగా ఉపయోగించడంలో అతని వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించిందన్నాడు.

తొలి రోజు ఆస్ట్రేలియా పైచేయి సాధించిందంటే దానికి ప్రధాన కారణం రోహిత్ కెప్టెన్సీ ముఖ్య కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఫీల్డింగ్ కూర్పు బాగాలేదని, బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేదని, అంతేగాక ఒత్తిడి సమయంలో బౌలర్లకు తగు సలహాలు, సూచనలు ఇవ్వడంలో రోహిత్ విఫలమయ్యాడని గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News