Wednesday, January 22, 2025

డబ్ల్యూటిసి ఫైనల్ సమరం… కష్టాల్లో టీమిండియా

- Advertisement -
- Advertisement -

డబ్ల్యూటిసి ఫైనల్ సమరం.. కష్టాల్లో టీమిండియా
ఆస్ట్రేలియా 469 ఆలౌట్, భారత్ 151/5

లండన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమరంలో గురువారం రెండో రోజూ కూడా టీమిండియాకు కష్టాలు తప్పలేదు. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకే ఆలౌట్ చేసిన ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే భారత్ మరో 318 పరుగులు చేయాలి.

సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె (29), వికెట్ కీపర్ శ్రీకర్ (5) క్రీజులో ఉన్నారు. కాగా, ఓపెనర్లు రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (13) విఫలమయ్యారు. సీనియర్లు చటేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లి (14)లు కూడా నిరాశ పరిచారు. అయితే కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 పరుగులు చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) సెంచరీలతో రాణించారు. వికెట్ కీపర్ కారీ (48)కు తనవంతు పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు, షమి, శార్దూల్ చెరో రెండేసి వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News