- Advertisement -
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆసీస్, టీమిండియాకు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న ఆసీస్.. మూడో రోజు సెకండ్ ఇన్నింగ్స్‌లో 270/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు ఆసీస్ 444 పరుగుల టార్గెట్ ను ఉంచింది.
అనంతరం లక్ష చేధనలో భారత్ టీ విరామ సమయానికి 7.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(18) మరోసారి విఫలమయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ(22), పుజారా(0)లు ఉన్నారు. కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
- Advertisement -