Saturday, December 21, 2024

వైస్ కెప్టెన్‌గా పుజారా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకూ డబ్ల్యూటిసి ఫైనల్ 2023 మ్యాచ్ జరగనుంది. ఈ మెగా ఫైనల్ కోసం ఇప్పటికే భారత జట్టును ప్రకటించిన బిసిసిఐ వైస్ కెప్టెన్ ఎవరనేది తెలియజేయలేదు. ఛతేశ్వర్ పుజారాతో పాటు ఐపిఎల్ 2023లో అద్భు త ప్రదర్శనతో పునరాగమనం చేసిన మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే రేసులో ఉన్నాడు. రహానే, పుజారాలలో ఒకరిని రోహిత్ శర్మ డిప్యూటీని చేస్తారంటూ క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ పుజారానే భారత జట్టు వైస్ కెప్టెన్ అని చెప్పాడు. పుజారానే టీమిండియా వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడు. అందరికీ ఈ విషయం తెలుసు.

కానీ.. పుజారా నియామకానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. డబ్ల్యూటిసి ఫైనల్ 2023 కోసం జట్టు వివరాలు ఐసిసికి సమర్పించే సమయం (మే 23)లో పుజారా పేరును వైస్ కెప్టెన్ గా చేర్చుతారు. కౌంటీ జట్టు ససెక్స్ కెప్టెన్‌గా పు జారా అద్భుతంగా రాణిస్తున్నాడు. పూజారా ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం’ అని బిసిసిఐ సీనియర్ అధికారి చెప్పారు. కాగా, ఆస్ట్రేలియాతో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2023 సందర్భంగా భారత జట్టుకు ఛతేశ్వర్ పు జారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆపై కౌంటీ క్రికెట్‌లో ససెక్స్ జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. వరుసగా 115, 35, 18, 13, 151, 136, 77 పరుగులతో కౌంటీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. 2023 మే 24 నాటికి కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా కీలక ప్లేయర్లు లండన్‌కు చేరుకోనుండాగా, పుజారా కాస్తా ఆలస్యంగా చేరుకోనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News