Monday, December 23, 2024

జూన్ 7న డబ్ల్యూటిసి ఫైనల్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తేదీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్రకటించింది. ఇంగ్లాండ్‌లోని వేదికగా 7న ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుందని ఐసిసి వెల్లడించింది. జూన్ 12న రిజర్వుడేగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఐసిసి ప్రకటన విడుదల చేసింది. లండన్‌లోని ఓవల్ వేదికగా 7నుంచి 11వరకు టైటిల్ పోరు జరగనుంది.

కాగా భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్లూటిసి ఫైనల్లో కివీస్ జట్టు విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచింది. సౌథాంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 8వికెట్ల తేడాతో భారత్‌పై న్యూజిలాండ్ గెలిచింది. తాజా సీజన్‌లో భారత్, ఆస్ట్రేలియా డబ్లూటిసి ఫైనల్‌కు చేరువయ్యాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో భారత్, ఆస్ట్రేలియా కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News