Sunday, January 19, 2025

అగ్ర స్థానానికి టీమిండియా..

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : కేఫ్‌టౌన్ టెస్టులో విజయం సాధించిన టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ కొత్త షెడ్యూల్ ఇప్పటి వరకూ నాలుగు టెస్టులాడిన భారత్ రెండింటిలో గెలుపొంది. ఒక దాంట్లో ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దీంతో భారత్ 26 పాయింట్లు, 54.16 సగటుతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

ఇక భారత్ చేతిలో ఓడిన సౌతాఫ్రికా జట్టు రెండో స్థానానికి పడిపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ రెండు టెస్టులాడిన పౌతాఫ్రికా జట్టు ఓ మ్యాచ్‌లో విజయం సాధించి, మరో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో 11 పాయింట్లు, 50.00 సగటుతో రెండో స్థానంలో కొనసాగుతోంది. వీటి తరువాతి స్థానాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News