Wednesday, January 22, 2025

18న ఆఫ్రికాలో డబ్ల్యూటిఐటిసి సమ్మిట్

- Advertisement -
- Advertisement -

లోగోను ఆవిష్కరించిన ఐటి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు

మన తెలంగాణ / హైదరాబాద్:  తెలుగు రాష్ట్రాలలోని ఐటి, పరిశ్రమల రంగాలకు విదేశాల్లోని అవకాశాలను చేరువ చేసే క్రమంలో వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటిఐటిసి) మరో కీలక ముందడుగు వేసింది. ఆఫ్రికా ఖండంలోని అవకాశాలను పరస్పరం అందిపుచ్చుకునేందుకు డబ్ల్యూటిఐటిసి సమ్మిట్ నిర్వహించనుంది. ఈ నెల 18 ఆదివారం దక్షిణాఫ్రికాలోని జోహనెస్బర్గ్ లో డబ్ల్యూటిఐటిసి సమ్మిట్ నిర్వహించనున్నారు. డబ్ల్యూటిఐటిసి సభ్యులు హాజరు కానుండటంతో పాటుగా వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు సైతం విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా టెక్నాలజీ ఎక్సేంజ్ జరగనుండటంతో పాటుగా బిజినెస్ ఎక్స్పాన్షన్(వ్యాపార విస్తరణ) టూర్ ఉండనుంది. దీనికి సంబంధించిన లోగోను ఐటి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.

డబ్ల్యూటిఐటిసి సమ్మిట్ పురస్కరించుకొని వివిధ దేశాల్లో నిర్వహించబోయే బిజినెస్ ఎక్స్పాన్షన్ టూర్ గురించి వివరించనున్నారు. ఈ నెల 12 నుంచి 24 తేదీలలో ఇథియోపియా, దక్షిణాఫ్రికా, లెసెథో, కింగ్డాం ఆఫ్ ఎస్వాథిని (స్వాజిలాండ్), మొజాంబిక్, కెన్యా, జింబాబ్వే, బోట్స్వానాలలో 25 మంది డెలిగేషన్లతో కూడి డబ్ల్యూటిఐటిసీ బృందం పర్యటించనుంది. అక్కడున్న వ్యాపార అవకాశాలను తెలుసుకోనున్నారు. దీంతోపాటుగా మహాత్మాగాంధీ మునిమనవరాలు, మాజీ ఎంపీ ఇలా గాంధీని డర్బన్లో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఆఫ్రికాలో డబ్ల్యూటిఐటిసిసమ్మిట్ లోగో ఆవిష్కరించిన సందర్భంగా డబ్ల్యూటిఐటిసీ చైర్మన్ సందీప్ మఖ్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆఫ్రికా దేశాల్లోని అవకాశాలను ఉపయోగించుకునేలా వ్యాపారవేత్తలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో, తెలంగాణలోని అవకాశాలను తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా డబ్ల్యూటిఐటిసి చైర్మన్ సందీప్ మఖ్తల మాట్లాడుతూ, ఆఫ్రికాలో డబ్ల్యూటిఐటిసి సమ్మిట్ ద్వారా ఆఫ్రికాలోని తెలంగాణ సహా తెలుగు రాష్ట్రాలలోని అవకాశాలను తెలియజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ కృష్ణ కౌశిక్ చిత్రపు, నివ్య పైడిపల్లి, శ్రీధర్ గోనెపల్లి, రవితేజ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News