Saturday, November 16, 2024

పేదరికంపై సంపూర్ణ విజయం

- Advertisement -
- Advertisement -
Xi Jinping declares complete victory over poverty
చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ వెల్లడి

బీజింగ్: చైనాలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించామని ఈ దేశ అధ్యక్షులు జి జిన్‌పింగ్ గురువారం ప్రకటించారు. పేదరికంపై పోరాటంలో తాము సంపూర్ణవిజయం సాధించినట్లు ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. గడిచిన నాలుగు దశాబ్దాలలో దేశంలో 77కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించామని, ఇది చరిత్రలో నిలిచే విజయం అవుతుందన్నారు. దేశంలో ఇప్పుడు నిరుపేదలు లేనేలేరని, ఈ దిశలో అత్యధిక జనాభాగల తమ దేశం విజయం సాధించి ఘనత చాటుకుందన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు పోరాడుతున్న వారిని సన్మానించేందుకు, పేదరిక నిర్మూలనలో దేశ విజయాల సమీక్షకు సమావేశం ఏర్పాటు అయింది.

చైనాలో 140 కోట్ల జనాభా ఉంది. గ్రామీ ప్రాంతాలలో పేదలందరిని దారిద్య్ర రేఖ నుంచి వెలుపలికి రప్పించామని, దీనితో పేదరిక నిర్మూలన దిశలో 2030 ఐరాస విధించిన నిర్ధేశిత లక్షాన్ని పది సంవత్సరాల ముందే సాధించినట్లు చైనా అధ్యక్షులు తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాల్లో పేదిరకంపై సాధించిన విజయాలు అత్యద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఈ దశాబ్ధ కాలంలోనే గ్రామీణ ప్రాంతాలకు చెందిన దాదాపు 99 కోట్ల మందిని పేదరికం నుంచి గట్టెక్కించారని, 832 పేదరిక స్థాయి కౌంటీలు, 1,28,000 పేదరికపు గ్రామాలలో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిందని, అక్కడ పేదరికం లేకుండా పోయిందని తెలిపారు. దేశంలో 1970 ప్రాంతంలో సంస్కరణల ప్రారంభం నుంచి ఇప్పటివరకూ చూస్తే దేశంలో పేదరిక నిర్మూలన వేగం పుంజుకోవడంతో పాటు ప్రపంచ స్థాయిలో పేదరిక తగ్గింపు లక్షంలో చైనా నుంచే 70 శాతం విజయం దక్కిందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News