Sunday, December 22, 2024

బంధువులను కట్టడి చేయండి..నిజాయితీతో మెదలండి

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : ఒళ్లు దగ్గరపెట్టుకోండి, మీరు అవినీతి పనులకు దిగకండి, కొడుకులు బంధువులను ముడుపులు లంచాలకు దూరంగా ఉంచండి. లేకపోతే తగు మూల్యం చెల్లించుకోవల్సిందే అని చైనా అధినేత జిన్‌పింగ్ అధికార కమ్యూనిస్టు పార్టీ నేతలకు చురకలు పెట్టారు. ఎంతటివారైనా నిజాయితీకి కట్టుబడి ఉండాల్సిందే. ప్రముఖ స్థానాల్లోని వారు తమ వారిని సాధ్యమైనంత వరకూ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోనివ్వరాదు. వారు కానీ మీరు కానీ పక్కదార్లకు వెళ్లరాదు అని జిన్‌పింగ్ ఉద్భోధించారు. ఇష్టం వచ్చినట్లు , అడ్డగోలు చర్యలకు దిగరాదు. విదేశాల నిర్ణయాలను గుడ్డిగా అనుకరించరాదు అని పార్టీ నేతలకు జిన్‌పింగ్ హితవు పలికారు. రెండు రోజుల క్రితం చైనా కమ్యూనిస్టు పార్టీ కీలక సమావేశం జరిగింది. దీనికి సంబంధించి ఆదివారం అధికారిక ప్రకటన వెలువరించారు.

సిపిసి పొలిటికల్ బ్యూరో సభ్యులు తమ బాధ్యతలను విస్మరించరాదు, ప్రత్యేకించి ప్రామాణిక మార్కిస్టు సిద్ధాంత హుందాతనాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇందులో ఎవరూ అతిక్రమణలకు దిగరాదని హెచ్చరించారు. ముందు నేతలు పార్టీ పట్ల పూర్తి స్ధాయి సమగ్రతను చాటుకోవాలి. స్వీయ క్రమశిక్షణ అత్యవసరం అని జిన్‌పింగ్ తెలిపారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు పాటించే సన్మార్గం ఎట్టకేలకు పార్టీకి ప్రయోజనం కల్గిస్తుందని చైనా ఎదురులేని నేత స్పష్టం చేశారు. పార్టీలో కానీ ప్రభుత్వ వ్యవస్థల్లో కానీ కీలక పదవులలో ఉండే వారు తమ కుటుంబ సభ్యుల విషయంలో అత్యంత కట్టుదిట్టమైన పద్ధతులు పాటించాల్సిందే. తమ వద్ద పనిచేసే సిబ్బంది విషయంలోనూ వీటిని అమలుపర్చాల్సిందే. ఇటువంటి చర్యలతోనే అవినీతి ఆటకట్టుకు దారితీస్తుందని స్పష్టం చేశారు. సిపిసికి చెందిన 24 మంది సభ్యుల పొలిటికల్ బ్యూరో పార్టీలో అత్యున్నత స్థాయి విధాన నిర్ణాయాత్మక కార్యవర్గంగా పనిచేస్తుంది. ఈ బ్యూరోలో తీసుకునే నిర్ణయాలే చైనా కమ్యూనిస్టు పార్టీని నడిపిస్తాయి. దేశ పాలనయంత్రాంగానికి కీలకం అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News