Tuesday, January 21, 2025

చైనా అధ్యక్షునిగా జిన్‌పింగ్ హ్యాట్రిక్

- Advertisement -
- Advertisement -

 

 

బీజింగ్: చైనా అధ్యక్షునిగా జీ జిన్‌పింగ్ వరుసగా మూడవ పర్యాయం ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. నేషన్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్‌పిసి) 14వ మహాసభ వరుసగా మూడవసారి జిన్‌పింగ్‌ను చైనా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అధ్యక్ష పదవితోపాటు సెంట్రల్ మిలిటరీ కమిషన్(సిఎంసి) చైర్మన్‌గా కూడా జిన్‌పింగ్ ఎన్నికైనట్లు సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. బీజింగ్‌లోగ్రేట్‌హాల్ ఆఫ్ ది పీపుల్‌లో జరిగిన ఎన్‌పిసి మహాసభలో దేశాధ్యక్షునిగా జిన్‌పింగ్‌ను దాదాపు మూడు వేల మంది సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో జిన్‌పింగ్ మినహా మరే అభ్యర్థి లేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News