Friday, December 20, 2024

చైనాలో తైవాన్ విలీనం కాక తప్పదు: జిన్‌పింగ్

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : తైవాన్ ద్వీపం తమ దేశంలో విలీనం కాక తప్పదని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. జనవరి 13న ఎన్నికలకు తైవాన్ సిద్ధమవుతున్న తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నుంచి ఈ వ్యాఖ్య రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మావో 130 వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి తైవాన్‌ను వేరు కానీయమని, మాతృభూమితో తైవాన్ పునరేకీకరణ జరగనుండడం తప్పనిసరి అని జిన్‌పింగ్ స్పష్టం చేశారు.

తైవాన్ జలసంధి అంతటా శాంతియుత సంబంధాలను ప్రోత్సహించాలని ప్రతిజ్ఞ చేశారు. చైనా నుంచి తైవాన్ ముప్పు ఎదుర్కొంటోంది. 2027 లో తైవాన్‌పై దండయాత్రలకు చైనా సిద్ధంగా ఉండాలని జిన్‌పింగ్ ఆదేశించినట్టు అమెరికా సైనిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనుండడం విశేషం. డెమోక్రాటిక్ ప్రొగ్రెసిట్ పార్టీ నేత లయ్ చింగ్‌టే ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్టు అంచనాలున్నాయి. అయితే తైవాన్‌లో ఎన్నికలు తమ అంతర్గత వ్యవహారంగా చైనా వాదిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News