- Advertisement -
తైవాన్‌పై బైడెన్‌కు జిన్‌పింగ్ హెచ్చరిక
వర్చువల్ వీడియో సమావేశంలో…
బీజింగ్: తైవాన్ భవిష్యత్తుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హెచ్చరికల యుద్ధానికి దిగారు. రెండు అగ్రరాజ్యాల మధ్య ఘర్షణ జరగకుండా ఉండేందుకు తైవాన్‌పై ‘గార్డ్‌రైల్స్’(కాపలాదారుల మధ్య) వర్చువల్ సమ్మిట్‌ను ఏర్పాటుచేసినప్పుడు ఆ ఇద్దరు అగ్రరాజ్య నేతలు పరస్పరం హెచ్చరికలకు పాల్పడ్డారు. ఇదో వీడియో లింక్డ్ సదస్సు. ఇందులో ‘నిప్పుతో చెలగాటం ఆడొద్దు’ అని బైడన్‌ను జీ హెచ్చరించారని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది.
“ సమావేశంలో తైవాన్‌పై విస్తారమైన చర్చ జరిగింది. జిన్‌జియాంగ్ ప్రాంతంలో ఉయ్‌గుర్స్ సామూహిక అణచివేతపై కూడా బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు” అని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. కాగా తైవాన్ స్వీయరక్షణకు అమెరికా మద్దతునివ్వగలదని బైడెన్ చైనాకు స్పష్టంచేశారు.
- Advertisement -