Monday, December 23, 2024

ఫారెక్స్ ఉల్లంఘన కింద షావోమి రూ. 5,551 కోట్ల డిపాజిట్లు జప్తు

- Advertisement -
- Advertisement -

 

Xiomi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ దిగ్గజ సంస్థ షావోమికి చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ. 5551.27 కోట్ల డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) అధికారులు జప్తు చేశారు. ఈ విషయాన్ని ఈడి శనివారం వెల్లడించింది. చైనాకు చెందిన షావోమి ఇండియా 2014 నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే ఆ మరుసటి ఏడావి నుంచే ఆ కంపెనీ అక్రమంగా నిధులను ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన ఈడి దర్యాప్తు చేపట్టింది. “ఈ కంపెనీ గత కొన్నేళ్లుగా రూ. 5551.27 కోట్లకు సమానమైన విదేశీ నిధులను మూడు విదేశాల్లో పనిచేస్తున్న మూడు సంస్థలకు అక్రమంగా పంపించింది. షావోమి గ్రూప్‌తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరాయి. సదరు సంస్థల నుంచి ఎలాంటి సేవలను పొందకుండానే ఈ నగదును పంపించింది. ఇది ఫెమా చట్ట నిబంధనలకు విరుద్ధం. అంతేకాక బ్యాంకులను తప్పుదోవ పట్టించి ఈ నిధులను విదేశాలకు చేరవేసింది” అని ఈడి తన ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసు విచారణలో భాగంగానే షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్‌ను ఈడి ఇటీవల ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News