- Advertisement -
న్యూఢిల్లీ: భద్రతా ముప్పును దృష్టిలో ఉంచుకుని కేరళలోని ఐదుగురు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులకు వై క్యాటగిరి భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించినట్లు శనివారం వర్గాలు తెలిపాయి. ఇటీవల నిషేధానికి గురైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ)పై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్వహించిన దాడులలో ఈ ఐదుగురు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులపై దాడికి సంబంధించిన పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారం, సిఫార్సుల ఆధారంగా కేంద్ర భద్రతా వ్యవస్థలో అత్యంత చిన్నదైన వై క్యాటగిరిని ఈ ఐదుగురు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కల్పించినట్లు వర్గాలు తెలిపాయి. కేంద్ర రిజర్వ్ పోలీసు దళం(సిఆర్‌పిఎఫ్)లోని విఐపి భద్రతా విభాగానికి ఈ భద్రతా బాధ్యతలు అప్పగించినట్లు వారు చెప్పారు.
- Advertisement -