Monday, December 23, 2024

పురుషజాతి అంతరిస్తుందా?

- Advertisement -
- Advertisement -

మగవాళ్లు అంతరించి మొత్తం మహిళలే భూమ్మీద ఉంటారా? జపాన్ లోని ఓ దీవిలో అంతరించి పోతున్న కొన్ని ఎలుకల్నిశాస్త్రవేత్తలు పరిశోధించారు. సాధారణంగా ఎలుకలు అంతరించిపోయే పరిస్థితి ఉండదు. అవి చాలా త్వరగా తమ సంఖ్యను పెంచుకోగలుగుతాయి. అలాంటిది మగ ఎలుకలు అంతరించిపోతుండడానికి కారణమేమిటో తెలుసుకోడానికి పరిశోధనలు చేపట్టారు. వాటిలో y క్రోమోజోములు లేవని తేలింది. అందుకనే ఆ దీవిలో మగ ఎలుకలు చాలా తక్కువగా, ఆడ ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్నారు. మనుషుల్లో కూడా ఈ పరిస్థితి వస్తుందని శాస్త్రవేత్తలు కొందరు భావిస్తున్నారు. సాధారణంగా మహిళల్లో xx క్రోమోజోములు ఉంటాయి. మగవారిలో x y క్రోమోజోములు ఉంటాయి. మగవారి నుంచి x క్రోమోజోము, ఆడవారి x క్రోమోజోముతో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. అదే మగవారి నుంచి y క్రోమోజోము, ఆడవారి x క్రోమోజోముతో కలిస్తే మగపిల్లవాడు పుడతాడు.

అయితే మగవారిలో ఆ y క్రోమోజోము ఉండదనీ, మగపిల్లలు పుట్టే అవకాశం పోయి, మగజాతి అంతరిస్తుందని అంచనా వేస్తున్నారు. జపాన్ లోని అమామీ ఒషిమా దీవిలో ఈ పరిస్థితి కనిపించింది. y క్రోమోజోము మాయమవడంతోపాటు ఆడ ఎలుకల్లో స్వయం పునరుత్పత్తి కనిపించింది. అందువల్ల మగ ఎలుకలతో పనిలేకుండా ఆడ ఎలుకలు స్వయంగా సంతానాన్ని పెంచ గలుగుతున్నాయి. దీనికి ప్రత్యేక జన్యువు కారణం అంటున్నారు. pnas జర్నల్‌లో ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం y క్రోమోజోము లేనంత మాత్రాన మగజాతి అంతం కాదని, మనుషుల విషయంలో మగవాళ్లను నిర్ధారించేది y క్రోమోజోము ఒక్కటే కాదని అంటున్నారు. అయినప్పటికీ మగవాళ్లలో కూడా y క్రోమోజోమ్ తగ్గుతోందని , అది పూర్తిగా ఎప్పటికి మాయమౌతుందో, అప్పుడు ఏమవుతుందో చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది పురుషుల్లో స్పర్మ్ కౌంట్, స్పర్మ్ నాణ్యత తక్కువగా ఉంటోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

ఆధునిక జీవనశైలియే కారణమని చెబుతున్నారు. దూమపానం, మద్యపానం, ఊబకాయం, శరీరం బరువు పెరగడం, వృషణాలు వేడెక్కడం, డ్రగ్స్ ఉపయోగించడం, ఒత్తిడి, ఆందోళనలు పెరగడం ఇవన్నీ స్పర్మ్ కౌంట్ తగ్గడానికి దారి తీస్తున్నాయి. తక్కువ స్పెర్మ్ కౌంట్ అంటే ఉద్వేగం సమయంలో స్ఖలనం చేసే వీర్యం సాధారణం కంటే తక్కువ స్పెర్మ్‌ను కలిగి ఉంటుంది. ఒక మిల్లీ లీటర్ వీర్యంలో 15 మిలియన్ కంటే తక్కువ స్పెర్మ్ ఉంటే దానిని సాధారణం కంటే తక్కువ స్పెర్మ్ కౌంట్‌గా పరిగణిస్తారు. తక్కువ స్పెర్మ్ కౌంట్ కలిగి ఉండటం వల్ల వారి భాగస్వామిలో అండం ఫలధీకరణం చెందదు. కాబట్టి పిండం తయారవ్వదు. అయినప్పటికీ తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్న చాలా మంది పురుషులు ఇప్పటికీ సంతాన వంతులవుతున్నారు. అనేక ఆధునిక చికిత్స విధానాలు అందుబాటు లోకి రావడం కొంతవరకు ఈ సమస్య పరిష్కారమవుతోంది.

స్పెర్మ్ కౌంట్ పెంచే ఆహారాలు
జింక్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం అవసరం. బార్లీ, రెడ్ మీట్, బీన్స్ మొదలైనవాటిలో జింక్ అధికంగా ఉంటుంది. స్పెర్మ్ అభివృద్ధిలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. మగవారికి రోజుకు 15 ఎంజి వరకు జింక్ అవసరమవుతుంది. అరటిపండులో విటమిన్ ఎ. బి1, సి పుష్కలంగా ఉంటాయి. స్పెర్మ్ ఉత్పత్తికి ఇవి సహాయ పడతాయి. దానిమ్మ ఎక్కువగా తినడం వల్ల హెమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అదనంగా స్పెర్మ్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే క్యారెట్ తీసుకున్నా స్పెర్మ్ పెరుగుతుంది. గుమ్మడి కాయ గింజలను రోజూ తినడం వల్ల శరీరంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సరఫరా పెరుగుతుంది. పురుషుల జననేంద్రియాల్లో రక్త ప్రసరణ పెంచుతుంది. అలాగే స్పెర్మ్ ఉత్పత్తి పెంచుతుంది. టొమాటోలో ఉండే లైకోపీస్ అనే పదార్థం స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతుంది. స్పెర్మ్ నాణ్యత కూడా పెరుగుతుంది. వెల్లుల్లి , పాలకూర, గుడ్లు స్పెర్మ్ ఉత్పత్తిని, నాణ్యతను పెంచుతాయి.

Also Read: 2100 నాటికి హిమానీ నదాలు అదృశ్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News